మెగా ఫ్యామిలీలో బన్నీనే టాప్
చిరంజీవి ద్వారా ఆయన ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఎంతమంది ఉన్నా ఇండస్ట్రీని రూల్ చేస్తున్న స్టార్స్ మాత్రం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణే కనిపిస్తారు. మిగిలిన సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్ లు టైర్2 హీరోలుగా నిలదొక్కుకోవడానికే నానా తంటాలు పడుతున్నారు.
మెగాస్టార్ తర్వాత స్టార్ హీరోలుగా పవన్, చరణ్, అల్లు అర్జున్ ఎవరికి వారే స్పెషల్ ప్లేస్ ను క్రియట్ చేసుకున్నారు. వీరందరిలో మార్కెట్ పరంగా ఎక్కువ ఆధిపత్యం ఎవరిదంటే వెంటనే వినిపిస్తున్న పేరు మాత్రం అల్లు అర్జున్‌దే. పుష్ప సినిమాతో టాలీవుడ్లో ఎవరికీ సాధ్యం కాని నేషనల్ అవార్డును అందుకుని తన స్థాయిని పెంచుకున్నాడు బన్నీ.
దీంతో బన్నీ ప్రస్తుతం చేస్తున్న పుష్ప2 పై భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ తర్వాత స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నప్పటికీ ఆ సినిమా క్రెడిట్ మొత్తం రాజమౌళికే దక్కింది. ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ మంచి హిట్ అయితే చరణ్ వాల్యూ పాన్ ఇండియా స్థాయిలో బాగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక పవన్ అటు రాజకీయాలతో పాటూ సినిమాలు చేయడం వల్ల పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకోలేకపోయాడు. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న విశ్వంభరతో తన స్టామినాను చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతమున్న మార్కెట్, బిజినెస్, బ్రాండ్ వాల్యూ, రికార్డ్స్ పరంగా చూసుకుంటే మెగా హీరోల్లో అల్లు అర్జునే టాప్ లో ఉన్నాడని సినీ విశ్లేషకులు, విమర్శకులు అంటున్నారు. పుష్ప2తో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరితో ఇమేజ్ పరంగా బన్నీని మ్యాచ్ చేయడం ఎవరి వల్లా కాదని వారు అభిప్రాయపడుతున్నారు. బన్నీ నటిస్తున్న పుష్ప2 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.













