సైలెంట్ గా మొదలుపెట్టిన బ్లడీ రోమియో!
నేచురల్ స్టార్ నాని(nani) తన కెరీర్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ది ప్యారడైజ్(the paradise) కోసం ఎంతోకాలం కేటాయించిన ఆయన, ఆ సినిమా రిలీజ్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. సినిమా చుట్టూ మిక్డ్స్ రెస్పాన్స్ లు వ్యక్తమైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. కొంత గ్యాప్ తీసుకున్న నాని, డైరెక్టర్ సుజీత్(Sujeeth) తో కలిసి తెరకెక్కిస్తున్న బ్లడీ రోమియో(Bloody Romeo) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనుండటం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది.
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఫుడ్ మాఫియా నేపథ్యంలో లండన్ నగరాన్ని కథా వేదికగా ఎంచుకున్నారు. ఇప్పటికే ఢిల్లీలో షూటింగ్ మొదలవగా, అక్కడ వారం రోజుల పాటు కీలక సీన్స్ ను తెరకెక్కించనున్నారు. తర్వాత హైదరాబాద్‌లో నెక్ట్స్ షెడ్యూల్‌ను నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ రెడీ చేసింది. కథలోని విభిన్న కోణాలు, నాని క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథకు అనుగుణంగా లండన్‌లో ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది. దీని కోసం స్పెషల్ షెడ్యూల్స్ ను రూపొందిస్తున్నారు. నాని, సుజీత్ కలయికలో వస్తున్న ఈ సినిమా యాక్షన్, గ్యాంగ్‌స్టర్ అంశాలతో ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందిస్తుందని అంచనా. 2027 వేసవిలో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు.








