ఇకపై అగ్ర నటుల బయోపిక్ చిత్రాలు వస్తాయంటారా?
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామ రావు నిజ జీవితానికి అద్దం పడుతూ యన్.టి .ఆర్ కథానాయకుడు _ యన్.టి .ఆర్ మహానాయకుడు బయోపిక్ మూవీస్ అందించారు నట సింహ నందమూరి బాలకృష్ణ. ఎంతో సుదీర్ఘమైన చరిత్ర వున్నా ఆ మహానటుడి బయోపిక్ మూవీస్ ఆశించినంతగా విజయం సాధించలేదు. అది అలా ఉండగా… మెగాస్టార్ చిరంజీవి… వెండితెర మీద మాస్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్. తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన మెగా హీరో. బాలీవుడ్ తారలు కూడా సాధ్యం కాని రికార్డ్లను ఎంతో ముందుగానే సాధించిన టాప్ హీరో. అందుకే 10 ఏళ్ల విరామం తరువాత ఆయన తిరిగి వెండితెర మీద కనిపించినా ప్రేక్షకులు నిరాజనం పట్టారు. ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇస్తే అభిమానులు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. అంటే మెగాస్టార్ ని ఇంకా మాస్ హీరోగా చూస్తాం అని ప్రూవ్ చేసింది ఆ చిత్రం ఇలాంటి రికార్డులు ఎన్నో సాధించిన మెగాస్టార్ బయోపిక్ తీస్తే వర్క్ అవుట్ అవుతుందా..?
ఈ విషయం మీద గతంలో మెగాస్టార్ కూడా స్పందించాడు. తన జీవితంలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన ట్విస్టులు బలమైన సంఘటనలు లేదని చెప్పాడు చిరంజీవి. అందుకే తన బయోపిక్ తీస్తే వర్క్ అవుట్ కాదంటూ చెప్పేశాడు. అందుకు కారణాలు లేకపోలేదు. చిరు సినిమా అవకాశాల కోసం ఎక్కువ సమయం పెద్దగా కష్టపడలేదు. చెన్నై లో తన కెరీర్ స్టార్టింగ్‌లో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడినా కమర్షియల్ సినిమా కావాల్సినంత మసాలా మాత్రం లేదు. హీరోగా ప్రూవ్ చేసుకున్న తరువాత చిరంజీవి వెనుదిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపులు వచ్చినా చిరు ఇమేజ్ మాత్రం పెరుగుతూనే వచ్చింది. అంటే చిరంజీవి నిజ జీవితం లో కానీ, సినీ జీవితం బయోపిక్ తీసేందుకు సినిమా జీవితం లో ట్విస్టులు లేవు. ఒక వేళ చిరంజీవి రాజకీయ జీవితం ప్రస్థావించాల్సి వస్తే చిరు అందుకు ఆయన అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే చిరంజీవి సొంతగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో దారుణంగా విఫలమయ్యాడు. అధికారం చేపట్టాలని ఆశించిన చిరంజీవి కనీసం పోటి కూడా ఇవ్వలేకపోయాడు. మరి ఆ పాయింట్‌ను సినిమాలో ప్రస్థావించేందుకు చిరంజీవి అంగీకరిస్తాడా..? ఇలా ఏ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా సినిమా తెరకెక్కిస్తే ఏ మాత్రం ఆకట్టుకోదు అన్న విషయాన్నీ గ్రహించాడు చిరంజీవి . అందుకే మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెర మీదకు వచ్చే అవకాశం లేదు. అయితే ఒకవేళ చిరంజీవి బయోపిక్ రూపొందిస్తే మాత్రం రామ్ చరణ్ కన్నా మేనమామ చిరంజీవి పోలికలతో వుండే సాయి ధరమ్ తేజ్ అయితే కరెక్ట్ అంటున్నారు ఫ్యాన్స్.













