Bhool Chuk Maaf: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న వామికా గబ్బి సినిమా
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలోని పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఆ దాడిని ఖండిస్తూ భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) పేరుతో పాక్ టెర్రరిస్టులపై ఉగ్రదాడులు చేయగా, ఇప్పుడు దేశంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని అందరూ ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎవరూ పబ్లిక్ లోకి వెళ్లడానికి ధైర్యం చేయడం లేదు. ఈ నేపథ్యంలో రేపు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఓ మూవీ ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. వామికా గబ్బి(Wamiqa Gabbi) హీరోయిన్ గా నటించిన భూల్ చుక్ మాఫ్(Bhool Chuk Maaf) మే 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇప్పుడు ఆ సినిమా మే 16కు వాయిదా పడింది.
వాయిదా పడటమే కాదు, థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నేరుగా ప్రైమ్ వీడియో(Prime Video)లో రిలీజ్ కానుంది. దీనికి కారణం దేశంలోని పరిస్థితులే అంటున్నారు చిత్ర మేకర్స్. దేశంలోని పరిస్థితులు, పెరిగిన భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఓటీటీ రిలీజ్ ను సెలెక్ట్ చేసుకున్నట్టు నిర్మాత దినేష్ విజన్Dinesh Vijan) తెలిపారు. కరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు(Rajkumar Rao) ప్రధాన పాత్రలో నటించారు.






