Bheems Ceciroleo: ఇన్నేళ్లకు సరైన బ్రేక్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్
టాలీవుడ్ లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ల కొరత బాగా ఉంది. అన్నీ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad), తమన్(Thaman) ను తీసుకోవాలంటే కుదిరే పని కాదు. పైగా వాళ్లు కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. మణిశర్మ(Manisharma)ను తీసుకుందామంటే ఆయన మ్యాజిక్ వర్కవుట్ అవడం లేదు. మిక్కీ జే మేయర్(Micky J Mayer) విదేశాల్లో ఉంటే, అనూప్(Anoop) ఫామ్ లో లేడు. ఇక అనిరుధ్(Anirudh) రూ.10 కోట్లు ఇచ్చినా దొరికే సిట్యుయేషన్స్ లో లేడు.
దీంతో పక్క భాషల నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను తెచ్చుకుని వారిపై డిపెండ్ అవాల్సి వస్తోంది. ఇలాంటి టైమ్ లో భీమ్స్(Bheems ciciroleo) లాంటి వాళ్లు టాలీవుడ్ కు ఆశలు చూపిస్తున్నారు. తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam)కి అతనిచ్చిన రెండు సాంగ్స్ ఛార్ట్బస్టలుగా నిలిచాయి. రీసెంట్ టైమ్స్ లో ఇంత ఫాస్ట్ గా మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేసిన సాంగ్స్ ఇవే.
రమణ గోగుల(Ramana Gogula)తో పాడించిన గోదారి గట్టు మీద సాంగ్, సెకండ్ సాంగ్ గా వచ్చిన మీను మీను కూడా ఆడియన్స్ లోకి బాగా వెళ్లిపోయాయి. ఈ సినిమాలోని మిగిలిన పాటలు కూడా ఇదే రేంజ్ లో ఉన్నాయని యూనిట్ సభ్యులంటున్నారు. భీమ్స్ ఇకపై కూడా ఇలాంటి పనితీరునే కంటిన్యూ చేస్తే అతనికి తిరుగు ఉండదని కచ్ఛితంగా చెప్పొచ్చు. 2012లో నువ్వా నేనా సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయనకు ఇన్నేళ్ల తర్వాత బ్రేక్ దొరుకుతుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అతనిపైనే ఉంది.













