Mega157: వెంకీ దారిలోనే చిరూ కూడా
సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన నెక్ట్స్ మూవీని చిరంజీవి(Chiranjeevi)తో చేస్తున్న విషయం తెలిసిందే. చిరూ కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్టు చెప్పిన అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ మూవీలో మెగాస్టార్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించనున్నట్టు చెప్పాడు.
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) విజయంలో పెద్ద పాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo)నే చిరూ(Chiru)- అనిల్ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమా మ్యూజిక్ గురించి ప్రస్తుతం నెట్టింట ఓ అప్డేట్ వినినిస్తుంది. మెగా157 లో మొత్తం 5 పాటలుంటాయని, ఇప్పటికే మూడు ట్యూన్స్ ను లాక్ చేశారని, మరో రెండు పాటలను లాక్ చేయాల్సి ఉందని అంటున్నారు.
అంతేకాదు, ఈ మూవీ మ్యూజిక్ విషయంలో మరో క్రేజీ అప్డేట్ కూడా వినిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో యాటిట్యూడ్ పొంగల్(Attitude Pongal) సాంగ్ ను పాడి సినిమాకు మంచి హైప్ తెచ్చిన వెంకీ లానే, ఇప్పుడు చిరూతో కూడా ఓ స్పెషల్ సాంగ్ ను పాడించి సినిమాపై బజ్ తీసుకురావాలని చూస్తున్నాడట అనిల్ రావిపూడి. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండనే చెప్పాలి.













