బెల్లంబాబుల లక్ మామూలుది కాదు
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకు సాయి శ్రీనివాస్ ఇప్పటికే తెలుగు ఆడియన్స్ ముందుకు హీరోగా వచ్చాడు. కొన్ని సినిమాలు చేసిన సాయి శ్రీనివాస్ సక్సెస్, ఫ్లాపులను పట్టించుకోకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉంటే, సురేష్ చిన్న కొడుకు గణేష్ కూడా హీరోగా పరిచయమవబోతున్నాడు. గతేడాది గణేష్ మొదటి సినిమా పవన్ సాధినేని డైరక్షన్ లో స్టార్ట్ అయింది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా ఇప్పటి వరకు మళ్లీ స్టార్ట్ అవలేదు. మొదటి సినిమా అలా ఉండగానే రెండో సినిమాను కూడా గణేష్ లైన్ లో పెట్టాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరందుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ పెద్ద చిన్న స్టార్ లతో సినిమాలు నిర్మిస్తున్నారు.
అందులో భాగంగా, బెల్లంకొండ గణేష్ తో ఒక సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీని ఇప్పటికే గణేష్ ఓకే చేశాడట. అతి త్వరలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బెల్లంకొండ గణేష్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా అంటే ఖచ్చితంగా గణేష్ కు ఇది లక్ అనే చెప్పాలి. అది కూడా మొదటి సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమాను లైన్ లో పెట్టడమంటే మామూలు విషయం కాదు.













