ఇంకా ఏమిటి ఆలస్యం? ఐ యామ్ రెడీ అంటున్న బాలకృష్ణ!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా బిబి3 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. బాలకృష్ణ పుట్టినరోజుకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక షెడ్యూల్ చేశారు. దాని నుంచే టీజర్‌ను విడుదల చేశారు. ఇది జరిగి నాలుగు నెలలు దాటిపోయినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా పెద్ద హీరోలెవరూ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేని సమయంలోనే బాలకృష్ణ షూటింగ్ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ, బోయపాటి మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరగా ప్రారంభించాలని బాలకృష్ణ ఉత్సాహంగా ఉన్నాడు. అయితే బోయపాటి ఇంకా షూటింగ్‌కి రెడీ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో క్లారిటీ రాలేదు.
ఒక హీరోయిన్ ఫైనల్ అయిందని ఈమధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్త నిజం కాదని తెలుస్తోంది. నెల రోజులుగా హీరోయిన్ కోసం బోయపాటి ఆఫీస్‌లో ఆడిషన్స్ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు బాలకృష్ణకు విలన్‌గా ఎవరు చేస్తే బాగుంటుందనే విషయంలో కూడా బోయపాటి ఒక నిర్ణయానికి రాలేదు. బాలకృష్ణ వంటి పవర్ఫుల్ హీరోకి సమానమైన విలన్ క్యారెక్టర్ చేసే ఆర్టిస్టు కూడా పవర్ఫుల్ అయి ఉండాలి. అలాంటి విలన్ కోసం బోయపాటి అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే మిగతా నటీనటుల ఎంపిక కూడా జరగాల్సి ఉంది.
సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్లు, సంగీత దర్శకుడు తప్ప ఈ సినిమాకి మరే ఇతర టెక్నీషియన్స్ ఫైనల్ అవ్వలేదు. ఇన్ని అవరోధాల మధ్య షూటింగ్ స్టార్ట్ చెయ్యడం సాధ్యమయ్యే విషయం కాదు. అంతేకాదు, ఇటీవల కురుస్తున్న వర్షాలు కూడా షూటింగ్ చేయడానికి అనుకూలంగా లేదు. బాలయ్య మాత్రం దసరా తర్వాత షూటింగ్ వెళ్ళాలని అనుకుంటున్నాడు. మరి బోయపాటి షూటింగ్ ప్రారంభించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.













