బాలయ్య, బోయపాటి టైటిల్ అనౌన్స్ ఆరోజే…!
నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా టైటిల్ ఏంటనే విషయం గురించి గత కొన్నాళ్లుగా నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోనార్క్, సూపర్ మ్యాన్, గాడ్ ఫాదర్ ఇలా ఎన్నో టైటిల్స్ ప్రచారం జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఏ టైటిల్ ను కన్ఫర్మ్ చేయకుండా నెట్టుకొస్తున్నారు బీబీ3 టీమ్ యూనిట్. ఇలాంటి టైమ్ లో టైటిల్ ను రివీల్ చేసేందుకు ముహుర్తం ఖరారు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమా టైటిల్ ను మాత్రం ఉగాది సందర్భంగా రివీల్ చేయనున్నారట. వచ్చే నెల 13న ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. టైటిల్ తో పాటుగా టీజర్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందుతుంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే అవకాశాలున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో రానున్న హ్యాట్రిక్ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తుంటే, కీలక పాత్రలో పూర్ణ కనిపించనుంది.













