ఎ.ఆర్. రెహమాన్ కు అరుదైన గౌరవం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఇండియా-యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్‌కు రాయబారిగా ఎంపికయ్యారు. రెండు దేశాలకు చెందిన వర్ధమాన కళాకారుల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింతగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన ద సీజన్ ఆఫ్ కల్చర్‌ను ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ జాన్ థామ్సన్, బిట్రిష్ కౌన్సిల్ డైరెక్టర్ (భారత్) బార్బరా విక్హమ్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ సృజనాత్మక ఉత్కృష్టత, కళాత్మక ప్రశంసలకు మద్దతు ఇచ్చే, విభిన్న ప్రేక్షకులను ఒక్క చోటుకు చేర్చే వినూత్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.













