నవ్యాంధ్రలో తీసే సినిమాలకు రాయితీలు
నవ్యాంధ్రలో రూ.4 కోట్లకు లోబడిన బడ్జెట్తో చిత్రీకరించిన సినిమాలకు పన్ను మినహాయింపు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిలిం అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, పార్లమెంటు సభ్యుడు అంబికాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో నెం.116 జీవోను ప్రవేశపెట్టామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి వందదాకా చిన్న సినిమాలు వస్తాయని, అందులో 50 సినిమాల చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్లో జరిగినా 20 వేల మందికి ఉపాధి కలుగుతుందనేది ఉద్దేశమన్నారు. ఈ వెసులుబాటు ఉపయోగించుకోవాలంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోనే సినిమా చిత్రీకరించాలన్నారు.













