మెగాస్టార్ సరసన అనుష్క ?
స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ ఐటెం సాంగ్లో చిందులేసింది అనుష్క. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ షూర్ చేసేటప్పటికి అనుష్క బాహుబలి, భాగమతి చిత్రాలతో బిజీగా ఉంది. అయితే చిరు సరసన హీరోయిన్గా నటించే అవకాశం అనుష్కకి లభించలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు చిరంజీవితో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమాలో అనుష్కను తీసుకుందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సైరాలో చిరు సరసన నటిస్తున్న నయనతారకు కూడా మరోమారు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని చెపుకుంటున్నప్పటికీ, అనుష్క వైపే చిరంజీవి, కొరటాల మొగ్గు చూపుతున్నారని సమాచారం.













