లేడీ ఓరియెంటెడ్ మూవీతో అనుష్క రీ ఎంట్రీ
భాగమతి తర్వాత స్వీటి అనుష్క వెండితెరపై కన్పించలేదు. దీంతో ఆమె అభిమానులు తెగ ఫీలైపోతున్నారట. కొంతకాలంగా వెయిట్ లాస్‌పై ఫోకస్ పెట్టిన స్వీటి శిక్షణలో బిజీగా ఉన్న అనుష్క త్వరలో ఇండియాకు రానున్నారు. ఓ తమిళ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారట. లేడీ ఓరియెంటెడ్ పాత్రలో ఇంతకు ముందు చేయని కొత్త పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. ఇందులో హీరో ఎవరు వంటి విషయాలు ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే 152వ సినిమాకు స్వీటీని అడిగినట్టు ప్రచారం కూడా ఉంది. ఏదిఏమైనా అనుష్క తన చేయబోయే సినిమాలు, తన ప్యూచర్ గురించి క్లారిటీ రావాలంటే అమ్ముడు వచ్చేదాకా వెయింట్ చేయాల్సిందే మరి.













