Simbu49: శింబు సినిమాకు అనిరుధ్

తమిళ చిత్ర పరిశ్రమలో అటు మాస్, ఇటు కంటెంట్ ను హ్యాండిల్ చేయగల డైరెక్టర్ ఎవరని అడిగితే ఎవరైనా వెంటనే వెట్రిమారన్(vetrimaran) పేరే చెప్తారు. ఆడుకలాం(aadukalam), వడా చైన్నై(vada chennai), అసురన్(asuran) లాంటి సినిమాలతో డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్న వెట్రిమారన్, ఇటీవలే తన నిర్మాణ సంస్థను మూసి వేస్తున్నట్టు అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు.
నిర్మాణ సంస్థను మూసేసినా డైరెక్టర్ గా సినిమాలు చేయడం మాత్రం ఆయన మానలేదు. తమిళ హీరో శింబు(simbu) హీరోగా వెట్రిమారన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శింబు కెరీర్లో 49(simbu49)వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. శింబు స్టైల్, వెట్రిమారన్ రియలిస్టిక్ మేకింగ్ ఎలా ఉంటుందో చూడ్డానికి ఆడియన్స్ కూడా ఈ సినిమాపై చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే వెట్రిమారన్ తన సినిమాలకు ఎక్కువగా జీవీ ప్రకాష్(GV Prakash kumar) తోనే మ్యూజిక్ చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు శింబు కోసం మొదటిసారి తన రూటును మార్చనున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే వెట్రిమారన్, అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) తో డిస్కషన్స్ చేస్తున్నారని, శింబు సినిమాకు కొత్త ఎనర్జీని తీసుకుని రావడానికే వెట్రిమారన్ ఈ మార్పు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ స్టార్ కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.