అనసూయ సంచలన నిర్ణయం
యాంకర్‌గా అనసూయకు ఉన్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. జబర్దస్త్‌తో ఫేమస్ అయిన రంగస్థలం సినిమాతో ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నారామె. ముఖ్యంగా రంగస్థలం రంగమ్మత్తగా ఆకట్టుకుని నటిగా పుల్ బిజీ అయిన అనసూయ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. తాను నిర్మాతగా మారబోతున్నట్టు అనసూయ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన అనసూయ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో తాను కూడ సినిమాలను నిర్మించాలనుకుంటున్నట్టు తెలిపారు. అయితే అనసూయ భవిష్యత్తులో తన ఆలోచనను అమలు చేస్తారా లేదా? ప్రస్తుతం ఏదైనా సినిమాను ప్లాన్ చేస్తున్నారా అనేది వేచిచూడాల్సి ఉంది.













