మరోసారి రచ్చలో అనసూయ
టీవీ యాంకర్ గా అందరికీ పరిచయమున్న అనసూయ ఫాలోయింగ్ చిన్నదేమీ కాదు. జబర్దస్త్ నుంచి సినిమాల వరకు వరుస ఛాన్సులతో దూసుకుపోయిన అనసూయ అప్పుడప్పుడు నెట్టింట నెటిజన్లతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఆన్లైన్ గొడవల వల్ల పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన గొడవలు కూడా ఉన్నాయి.
వీటి సంగతి పక్కన పెడితే రీసెంట్ గా అనసూయ మరోసారి ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండను టార్గెట్ గా చేసి ట్వీట్ చేయడం ఫ్యాన్స్ లో చిచ్చు రేపింది. హీరో పేరు ప్రస్తావించకపోయినా ఎవరి గురించో అర్థమయ్యేలాగే అనసూయ కౌంటర్ వేసింది. ఖుషి లిరికల్ సాంగ్ అప్డేట్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని ఉంది. మామూలుగా గొప్ప వ్యక్తులకు గౌరవం ఇచ్చే క్రమంలో దీన్ని వాడతారు. ఇందులో తీవ్రంగా తప్పుబట్టాల్సిందేమీ లేదు కానీ ఆ పైత్యం తనకూ అంటుకోకపోతే మంచిదని ట్వీట్ చేసింది అనసూయ.
అనసూయ చేసిన ఈ ట్వీట్ వైరల్ కావడంతో దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై కౌంటర్స్ స్టార్ట్ చేశారు. కొందరు సూటిగా కామెంట్ చేస్తే, మరికొందరు అసభ్యంగా కామెంట్స్ చేశారు. ఇప్పుడే కాదు అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అన్న మాట దగ్గర నుంచి అనసూయ ఏదో ఓ రూపంలో ఇలా టార్గెట్ చేస్తూనే ఉందని ఫ్యాన్స్ వెర్షన్. ఏదైనా సరే కెరీర్ పీక్ కు వెళ్తున్న టైమ్ లో అనసూయ ఇలా రాద్ధాంతం చేయడం ఎందుకని చాలా మంది అంటున్నారు.













