Anand Devarakonda: మరో హీరో దగ్గరికి వెళ్లిన ఆనంద్ సినిమా
ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య(Vyshnavi Chaitanya) జంటగా 2023లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన బేబీ(Baby) సినిమా ఎన్నో అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చిన మూడు నెలలకే అదే కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఏడాదిన్నర దాటిపోయినా దీని గురించ మరో అప్డేట్ బయటకు రాలేదు.
కల్ట్ బ్లాక్బస్టర్ బేబీ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా ఓ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సాయి రాజేష్(Sai Rajesh) ఈ సినిమాకు కథ అందిస్తాడని, రవి నంబూరి(Ravi Namburi) దర్శకత్వంలో సినిమా ఉంటుందని షూటింగ్ మొదలైందని, 2024 సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
కానీ ఆ తర్వాత నుంచి షూటింగ్ అప్డేట్స్ మాత్రం ఏమీ రాలేదు. 2025 కూడా వచ్చేసింది. ఈ గ్యాప్ లో ఆనంద్, వైష్ణవి ఇద్దరూ వేరే సినిమాలతో బిజీ ఉన్నారు తప్పించి వీరి కాంబోలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అప్డేట్స్ మాత్రం ఏమీ లేవు. తాజా సమాచారం ప్రకారం బేబీ కాంబోలో అనౌన్స్ చేసిన సినిమా ఆగిపోయిందని, అదే కథ ఇప్పుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) దగ్గరకు వెళ్లిందని, కిరణ్ కు ఆ కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకట వస్తుందని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.













