నయనతార, ఆర్జె బాలాజీ నటించిన అమ్మోరు తల్లి చిత్రంలో మొదటి పాట అమ్మోరు తల్లి విడుదల
డిస్నీ+ హాట్స్టార్ మల్టీప్లెక్స్ బ్యానర్లో అందరూ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న ‘అమ్మోరు తల్లి’ చిత్రంలోని మొదటి పాట ‘అమ్మోరు తల్లి’ ఇప్పుడు విడుదలైంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు ఆర్జె బాలాజీ ప్రధాన పాత్రలు పోషించారు
లింక్: https://www.youtube.com/watch?v=K__uqqCYWWg&feature=youtu.be
మ్యూజిక్ వీడియోలో భాగమైన ఉల్లాసవంతమైన ఈ పాటను ప్రముఖ గాయని ఎల్.ఆర్.ఈశ్వరి ఆలపించారు. ఈ వీడియోలో నయనతార మూకుతి అమ్మన్ దేవతగా కనిపిస్తారు.
అమ్మోరు తల్లి పాటను గిరీష్ గోపాల్కృష్ణన్ స్వరపరచి, కూర్పు చేసి, నిర్మించగా, సాహిత్యాన్ని రెహమాన్ అందించారు మరియు ఎల్.ఆర్.ఈశ్వరి పాటను పాడించారు.
అమ్మోరు తల్లి చిత్ర కథను ఆర్.జె.బాలాజీ మరియు ఎన్.జె.శరవణన్ రాసి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నయనతార, ఆర్.జె.బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇషారీ కె.గణేష్ తన బ్యానర్ వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కింద నిర్మించిన అమ్మోరు తల్లి చిత్రంలో ఊర్వశి, అజయ్ ఘోష్, మౌళి, స్మృతి వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. గిరీష్ గోపాల్కృష్ణన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఇది నవంబర్ 14న దీపావళి పండుగ స్పెషల్గా డిస్నీ+ హాట్స్టార్ విఐపిలో తెలుగులో ప్రసారం కానుంది.













