Amithab Bachan: అందుకే ఐశ్వర్యను అందరిముందు పొగడను
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amithab bachan) సినిమాల్లో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటే అమితాబ్ బచ్చన్ సందర్భం వచ్చినప్పుడల్లా తన కొడుకు అభిషేక్ బచ్చన్(Abhishek bachan) ను పొగుడుతూనే ఉంటాడనే సంగతి తెలిసిందే.
ఈ విషయంలో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. కొడుకు అభిషేక్ బచ్చన్ ను పొగిడినంతగా భార్య జయాబచ్చన్(jaya bachan)ను, కోడలు ఐశ్వర్యా రాయ్(aishwarya rai) ను అభిషేక్ పొగడడని ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇదే విషయంపై అమితాబ్ కు ప్రశ్న ఎదురవగా, ఆయన దానికి స్పందించి సమాధానమిచ్చారు. అభిషేక్ ను తాను ఎక్కువగా ప్రశంసించే విషయం నిజమేనని అన్నారు.
అభిషేక్ బచ్చన్ కు అందరిపైనా గౌరవం, ప్రేమ ఎక్కువని, అభిషేక్ ను పొగిడినట్టే తన భార్య జయా బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ ను కూడా తాను పొగుడుతానని, కాకపోతే వారిని తన మనసులోనే మెచ్చుకుంటానని, అది తనకు మహిళలపై ఉన్న గౌరవమని అమితాబ్ వెల్లడించారు. అభిషేక్ రీసెంట్ గా హౌస్ఫుల్5(housefull5) సినిమా చేయగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా అభిషేక్ ను అమితాబ్ ప్రశంసించారు.






