అమితాబ్ కు అరుదైన గౌరవం
భారత సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహృద్భావ రాయబారిగా నియమించుకుంది. దక్షిణాసియా ప్రాంతంలోని ప్రజలకు హెపటైటిస్ వ్యాధికి సంబందించి అవగాహన కల్పించేందుకు ఆయన డబ్ల్యూహెచ్ఓతో కలిసి పని చేయనున్నారు. ఏటా దక్షిణాసియాలో హెపటైటిస్ కారణంగా 4లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ సింగ్ తెలిపారు. 2030 కల్లా ఈ వ్యాధిని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో అమితాబ్ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. హైపటైటిస్-బితో బాధపడుతున్న తనకు, ఆ వ్యాధి వల్ల కలిగే బాధలు తెలుసునని అమితాబ్ అన్నారు. ఎవరూ దాని బారిన పడకూడదని ఆకాంక్షించారు.













