సినీ తారల డైరీ ఆవిష్కరణ
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఐదేళ్లుగా తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తోంది. విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నరేష్, ఎపి ఎఫ్ డిసి ప్రెసిడెంట్, నిర్మాత అంబికా కృష్ణ, దర్శకుడు వీరుపోట్ల, ఐజి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 2019కి సంబంధించిన డైరీని అంబికా కృష్ణ, నరేష్ ఆవిష్కరించారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ టివి అవార్డులతో పాటు సినిమా రంగానికి అవార్డులు అందించే కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందంగా వుందన్నారు. మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ఈ డైరీ కొత్త నటీనటులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ప్రతి ఏడాది టివి రంగానికి అవార్డులు అందిస్తున్న విష్టు ఇకపై సినిమా రంగానికి కూడా అవార్డులు అందించడం అభినందిస్తున్నాను అన్నారు. విష్ణు బొప్పన మాట్లాడుతూ గత ఏడాది నుంచి వెండితెర అవార్డులను అందిస్తున్నాం. ఈ ఏడాది ఆగస్టులో ఇచ్చే అవార్డ్స్‌కు సంబంధించిన పోస్టర్ కూడా విడుదలచేశామన్నారు.













