పవర్‌స్టార్ అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, చిత్ర నిర్మాతలు!
టాలీవుడ్లో అభిమానుల సందడి ఎక్కువే. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తోందంటే ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు అబిమానులు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్‌కి గురై ప్రాణాలు విడిచారు.
ఈ ఘటన మెగా ఫ్యామిలీలో విషాదాన్ని నింపింది. పవన్‌కల్యాణ్, చిరంజీవి, రామ్‌చరణ్ అభిమానుల మృతి పట్ల తమ సానుభూతిని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున సాయం అందించాలని జనసేన నేతలను ఆదేశించారు పవన్‌కల్యాణ్. అలాగే పవన్‌కల్యాణ్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలు కూడా 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా మెగా అభిమానుల మృతి పట్ల తన సానుభూతిని తెలియజేస్తూ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టుగా ప్రకటించారు.













