ఆ విషయంలో అందరూ రవితేజను ఫాలో అవాల్సిందే
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తుంటాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే తర్వాతి సినిమాను లైన్ లో పెడుతూ ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ఆగస్ట్ 15కి మిస్టర్ బచ్చన్ తో మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నాడు.
టైర్2 హీరోగా రవితేజ వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేస్తూ ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నాడు. టైర్ 1 హీరోల్లో ప్రభాస్ కూడా ఇంతే ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ ఏడాదికి 2 సినిమాలు కచ్ఛితంగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చూసుకుంటున్నాడు. రవితేజ బాటలోనే నాని కూడా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్నాడు.
విశ్వక్సేన్ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్, అక్టోబర్ లో మెకానిక్ రౌడీగా రాబోతున్నాడు. కానీ టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోలు సరైన ప్లానింగ్ లేకపోవడంతో సంవత్సరానికి ఒక సినిమాను కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. అఖిల్ ఏజెంట్ రిలీజై సంవత్సరం దాటినా ఇప్పటివరకు తన కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. నాగచైతన్య నుంచి ఈ ఏడాది తండేల్ ఒక్కటే రానుంది. రామ్ నుంచి కూడా డబుల్ ఇస్మార్ట్ ఒక్కటే ఈ ఏడాది రిలీజ్ కానుంది. తర్వాతి సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. సాయి తేజ్, వరుణ్ తేజ్ కూడా ఏడాదికి ఒక్కో సినిమాను చేస్తున్నారు. ఇక టైర్ 1 హీరోలైతే ఒక్కో సినిమాకు మినిమం రెండేళ్లు తీసుకుంటున్నారు. అందుకే సినిమాల ప్లానింగ్ విషయంలో హీరోలంతా రవితేజను ఇన్సిపిరేషన్ గా తీసుకోవాలని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.













