పండుగాడు వస్తున్నాడు
అలీ, రిషిత (భవ్యశ్రీ) జంటగా నటిస్తున్న చిత్రం పండుగాడి ఫొటో స్టూడియో. బాబుమోహన్, వినోద్‌కుమార్, జీవ, సుధా, చిత్రం శ్రీను, శ్రీలక్ష్మి ఇతర పాత్రదారులు గుదిబండి సాంబిరెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ కూడా పూర్తి చేశారు. ఇదే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అలీ పాత్ర సరదాగా సాగుతుంది. ఆయన ఎవరికైనా ఫోటో తీస్తే వారికి వెంటనే వివాహం నిశ్చయం అవుతుంది. ఇదే అంశాన్ని వినోదాత్మకంగా చూపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఛాయాగ్రహణం: మురళీమోహన్ రెడ్డి, కథ, మటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దిలీప్ రాజా.













