Naslen: ప్రేమలు యాక్టర్ నుంచి మరో మంచి సినిమా
ప్రేమలు(Premalu) ఫేమ్ నస్లెన్ గపూర్(Naslen Gafoor) హీరోగా ఖలీద్ రెహమాన్(Khaleed Rahman) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అలప్పుజ జింఖానా(Alappuzha Gymkhana). ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజైంది. ఈ మూవీ చూసిన వారంతా సినిమా ఎంతో బావుందని రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. దానికి తోడు మూవీలో నస్లెన్ మంచి నటనను కూడా కనబరిచాడంటున్నారు.
ఏప్రిల్ 10న మలయాళం నుంచి అలప్పుజ జింఖానాతో పాటూ బాసిల్ జోసెఫ్(Basil Joseph) మూవీ మరణ మాస్(marana mass), మమ్ముటి(mammotty) మూవీ బజూక(Bazooka) ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాల్లో అలప్పుజ జింకానా విజేతగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి మౌత్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాతో పాటూ వేరే మూవీస్ కూడా రిలీజయ్యాయి.
అజిత్(ajith) గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly), సన్నీ డియోల్(sunny deol) జాత్(Jaath), సిద్దు జొన్నలగడ్డ(sidhu jonnalagadda) జాక్(Jack) కూడా రిలీజవగా వీటన్నింటిలో అలప్పుజ జింకానాకు ఎక్కువ మొత్తంలో స్క్రీన్స్ లభించాయి. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. చూస్తుంటే నస్లెన్ కు ఈ సినిమా ప్రేమలు(Premalu) తర్వాత మరో రూ.100 కోట్ల గ్రాస్ అందించేలా అనిపిస్తుంది.













