విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ఐశ్వర్యా
ఈ మధ్య సినీ జంటల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం గత కొన్నేళ్లలో నాగచైతన్య(Naga Chaitanya)-సమంత(Samantha), ఐశ్వర్య(Aishwarya)- ధనుష్(Dhanush) తాజాగా జయం రవి(Jayam Ravi)- ఆర్తి(Aarthi) కూడా విడాకులకు అప్లై చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ అభిషేక్ బచ్చన్(Abhishek Bachan)- ఐశ్వర్యా రాయ్( (Aishwarya Rai) కూడా విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా అనంత్ అంబానీ(Ananth Ambani) పెళ్లికి కూడా ఐశ్వర్యా తన భర్తతో కాకుండా విడిగా కూతురితో వచ్చింది.
ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలొచ్చాయని వార్తలొస్తున్న టైమ్ లో ఐశ్వర్య ఇలా భర్తతో కాకుండా విడిగా ఓ పెద్ద వేడకకు రావడంతో ఈ వార్తలు నిజమేననుకుని విడాకుల వార్తలను మరింత హైలైట్ చేసింది మీడియా. అయితే ఇప్పుడు ఆ వార్తలకు ఐశ్వర్య చెక్ పెట్టేసింది. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్ కు కూతురితో కలిసి వెళ్లిన ఐశ్వర్య ఆ వేడుకలో పెట్టుకున్న ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ ఉంగరం పెళ్లి టైమ్ లో అభిషేక్, ఐశ్వర్యకు తొడిగింది కావడం విశేషం. ఐశ్వర్య ఆ ఉంగరం ధరించిందంటే విడాకుల వార్తలకు చెక్ పడినట్లే. మరి మధ్యలో ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందన్నది మాత్రం తెలియదు. ఈ మధ్య మాత్రం భర్తకు దూరంగా ఉంటున్న సంకేతాలు ఇచ్చిన ఐశ్వర్య తన తాజా చర్యతో విడాకుల ప్రచారానికి తెరపడింది.













