లారెన్స్ కు అరుదైన గౌరవం
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్‌ను మదర్ థెరీసా అవార్డు వరించింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో లారెన్స్ ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు ప్రదానోత్సవ వేదికపైకి తన తల్లిని తీసుకువెళ్లిన లారెన్స్, ఆమె సమక్షంలోనే అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చెన్నైకి చెందిన మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఏటా ఈ అవార్డులను బహుకరిస్తోంది. మదర్ 108వ జయంతి సందర్భంగా లారెన్స్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది ట్రస్ట్. అనాథలు, రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న లారెన్స్, ఆపన్నులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా కేరళ వరద బాధితుల కోసం భారీ మొత్తంలో డబ్బులు అందజేశారు. ఆయన సేవలు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.













