విలన్ గా మారుతున్న అభిషేక్ బచ్చన్?
కల్కి 2898ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమితాబ్ బచ్చన్ ఎంతో ఆనందంగా ఉన్నాడు. అయితే అమితాబ్ స్థాయికి తన కొడుకు అభిషేక్ బచ్చన్ చేరుకోలేకపోయాడనే అసంతృప్తి మాత్రం బచ్చన్ ఫ్యాన్స్ లో చాలా ఉంది. అభిషేక్ కు బాలీవుడ్ లో గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్స్ లేవు. తండ్రి లెగసీని కొనసాగించలేకపోయినప్పటికీ మంచి పాత్ర దక్కితే అభిషేక్ ఏ స్థాయిలో నటిస్తాడనేది అందరికీ బాగా తెలుసు. మణిరత్నం రావణ్ తో ఈ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో షారుఖ్ కూడా నటించనున్నాడు. కాకపోతే ఆయన క్యారెక్టర్ క్యామియో కాబట్టి మొదటి నుంచి చివరి వరకు ఉండదు.
ఈ సినిమాలో విలన్ గా అభిషేక్ బచ్చన్ ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. షారుఖ్, అభిషేక్ గతంలో కభీ అల్విదా నా కెహనా, హ్యాపీ న్యూ ఇయర్ లో కలిసి నటించారు. కానీ వారిలో ఒకరు విలన్ గా మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. సుజయ్ ఘోష్ కింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ క్రేజీ సినిమాల్లో ఒకటిగా భారీ బడ్జెట్ తో రూపొందనున్నట్లు సమాచారం.













