సౌత్ సినిమాలో విలన్ గా అభిషేక్ బచ్చన్
తమిళంలో జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన తని ఒరువన్ ఎంతటి బ్లాక్ బస్టర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తని ఒరువన్2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి క్లైమాక్స్ లో చనిపోవడంతో ఇప్పుడు సీక్వెల్ లోకి ఆయన్ను తీసుకోవడం కుదరదు.
అందుకే మోహన్ రాజా గత కొంతకాలంగా విలన్ కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా తన వేట ఫలించినట్లు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ ఈ విలన్ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా చెన్నై లో షోటో షూట్ చేసి లుక్స్ కూడా సంతృప్తికరంగా రావడంతో ఆయన్ను ఫైనల్ చేసినట్లు సమాచారం.
అభిషేక్ కు ఈ కథ విపరీతంగా నచ్చిందని అందుకే ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడని అంటున్నారు. తన తండ్రి అమితాబ్ సౌత్ లో కల్కి లాంటి భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న టైమ్ లో అభిషేక్ ఈ సినిమా చేస్తే సౌత్ డైరెక్టర్లకు మంచి విలన్ ప్రతినాయకుడు దొరికినట్లే అవుతుంది. తమిళంలో ఈ సీక్వెల్ రిజల్ట్ చూశాక దాన్ని బట్టి తెలుగు రీమేక్ ఉంటుందా లేదా అన్నది డిసైడ్ కానున్నాడట రామ్ చరణ్.













