వారణాసి తర్వాత మహేష్ లుక్ లో సర్ప్రైజ్
వారణాసి(varanasi) షూటింగ్లో తన పాత్రకు తగ్గట్టుగా పూర్తిగా మారిపోయిన మహేష్ బాబు(mahesh babu).. ఇప్పుడు మరోసారి లుక్ మార్చుకున్నారు. సినిమా షూటింగ్లో తన పార్ట్ పూర్తవడంతో ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో కనిపించిన మహేష్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విజువల్స్‌లో ఆయన క్లీన్ షేవ్‌తో కనిపించడం ఫ్యాన్స్ దృష్టిని స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది.
వారణాసి కోసం ఇన్నాళ్లూ గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపించిన మహేష్.. షూటింగ్ పూర్తవగానే తన సహజమైన క్లీన్ లుక్‌లోకి వచ్చేశారు. ఈ మార్పు వెనుక సినిమాలోని ఓ కీలకమైన పాత్ర ఉందనే డిస్కషన్ కొంతకాలంగా జరుగుతోంది. మహేష్ సినిమాలోని కొన్ని సీన్స్ లో 24 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నారనే సమాచారం ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ యంగ్ లుక్ కోసం డిజిటల్ టెక్నాలజీ కంటే మేకోవర్కే ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు లండన్‌లో కనిపించిన మహేష్ లుక్.. వారణాసిలోని ఆ యువకుడి పాత్రను గుర్తు చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. షూటింగ్‌కు చిన్న గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ కు వెళ్లడం మహేష్‌కు అలవాటే. ఈసారి కూడా అదే జరిగింది. దాదాపు నెల రోజుల పాటు లండన్‌లో ఉండనున్న ఆయన, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత వారణాసి డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది.








