సుకుమార్ శిష్యుల రెండో సినిమాలపై ఒకే తరహా డిస్కషన్
టాలీవుడ్లో డైరెక్టర్ గా సుకుమార్(sukumra)ది స్పెషల్ జర్నీ. ఆయన దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్న బుచ్చిబాబు (buchibabu), శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) తమ తొలి సినిమాలతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పెన(uppena)తో బుచ్చిబాబు సక్సెస్ అందుకుని రామ్‌చరణ్(ram charan)తో పెద్ది చేసే స్థాయికి వెళ్లగా.. దసరా(dasara)తో శ్రీకాంత్ ఓదెల కూడా తన సత్తా చాటాడు. అయితే ఇద్దరి రెండో సినిమాలు మాత్రం మొదటి సినిమాల స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయాయనే డిస్కషన్ మొదలైంది. పెద్ది, ప్యారడైజ్ విషయంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఈ విషయాన్ని మరింత హైలైట్ చేసింది.
ఈ రెండు సినిమాల విషయంలో మరో ఇంట్రెస్టింగ్ పోలిక కూడా కనిపిస్తోంది. హీరోయిన్ క్యారెక్టర్ల డిజైన్, వాటిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన విధానం విమర్శలకు కారణమైంది. పెద్దిలో జాన్వీ కపూర్(janhvi kapoor) పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో పాటు, గ్లామర్‌కే ఎక్కువగా పరిమితమైందనే అభిప్రాయాలు వచ్చాయి. ఇప్పుడు ప్యారడైజ్(paradise) లో కయాదు లోహార్(kayadu Lohar) చేసిన సుబ్బు పాత్రపైనా ఇలాంటి డిస్కషనే జరుగుతోంది. క్యారెక్టర్ లో బాధ, సంఘర్షణ ఉన్నప్పటికీ.. ఆమెను చూపించిన విధానం గ్లామర్ కోణంలో ఎక్కువగా గుర్తుండిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా సుబ్బు తల్లి పాత్రలోని కొన్ని సీన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీశాయి. దీంతో పెద్ది తర్వాత బుచ్చిబాబు మార్పులు చేసినట్టే.. ప్యారడైజ్ విషయంలోనూ శ్రీకాంత్ ఓదెల ఏమైనా మార్పులు చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది. కయాదు క్యారెక్టర్ కు సంబంధించిన సీన్స్ కోతలుంటాయా అని అనుకున్నప్పటికీ, శ్రీకాంత్ అలాంటివేమీ చేయలేదు.








