హిట్ సినిమా సీక్వెల్ కు రంగం సిద్ధం
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ సేతుపతి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో అలరిస్తున్న ఆయన రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన నటవిశ్వరూపాన్నిచూపించాడు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ఓ రేంజ్ లో హిట్ అయింది.
కెరీర్లో ఇప్పటికే 50 సినిమాలు పూర్తి చేసుకున్న సేతుపతి తన తర్వాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాండిరాజ్ సినిమా చేస్తున్న సేతుపతి నుంచి మరో రెండు సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఈ ఏడాది చివరి లోపు రైల్, విడుతలై2 రిలీజ్ అవుతాయి.
ఇదిలా ఉంటే సేతుపతి లైనప్ లోకి ఇప్పుడు మరో సినిమా చేరింది. అదే 96 సీక్వెల్. 2018లో రిలీజ్ అయిన 96 సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. స్కూల్ డేస్ లో ప్రేమించుకుని విడిపోయి పాతికేళ్ల తర్వాత గెట్ టు గెదర్‌లో కలుసుకున్నప్పుడు వారి మధ్య జరిగిన ఘటనలతో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను తీయనున్నట్లు డైరెక్టర్ ప్రేమ్ కుమర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని విజయ్, త్రిష డేట్స్ ఇవ్వగానే సినిమా మొదలవుతుందని తెలిపాడు.













