‘ఇండియా ఏఐ మిషన్’ మద్దతుతో ‘వర్య’ వీడియో జనరేషన్ మోడల్
అంతర్జాతీయ ఏఐ మార్కెట్లో పశ్చిమ దేశాల ఆంక్షల పర్వం నడుస్తున్న వేళ.. సాంకేతిక స్వయంసమృద్ధి (ఆత్మనిర్భరత) దిశగా భారతదేశం చారిత్రాత్మక మైలురాయిని అధిరోహించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ఇండియా ఏఐ మిషన్’ (IndiaAI Mission) సపోర్ట్‌తో సరికొత్త స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ ‘వర్య’ (Varya) అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఏఐ సాంకేతిక సంస్థ ‘అవతార్’ (Avatar) అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక వీడియో జనరేటివ్ ఏఐ మోడల్‌ను.. ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఆవిష్కరించారు.
అత్యంత చౌకైన సాంకేతికత
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఉన్న పాశ్చాత్య దేశాల టాప్ ఏఐ మోడల్స్‌తో పోలిస్తే ‘వర్య’ అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని తయారీ (IndiaAI Mission) సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఒక ఏఐ వీడియోను క్రియేట్ చేయడానికి అవసరమయ్యే సుమారు 50 సంక్లిష్టమైన సాంకేతిక దశలను ఈ మోడల్ కేవలం 4 దశలకే పరిమితం చేసింది. దీనివల్ల పని వేగం పెరిగి, ఇతర మోడల్స్ కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది.
ఈ మోడల్ ద్వారా కేవలం ఒక సెకను నిడివి గల హై-క్వాలిటీ వీడియోను జనరేట్ చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 0.48 (48 పైసలు) మాత్రమే. వినియోగదారులు తమకు కావలసిన కంటెంట్‌ను సాధారణ టెక్స్ట్ (Text) రూపంలో ఇస్తే.. దానిని క్షణాల వ్యవధిలో విజువల్ వీడియోలుగా మార్చే ‘స్మార్ట్ ప్రాంప్టింగ్’ ఫీచర్‌ను ఇందులో (IndiaAI Mission) పొందుపరిచారు.
ఇవి కూడా చదవండి
సామాన్యుడికి డిజిటల్ అస్త్రం
విదేశీ ఏఐ మోడల్స్ అనేకం ఉన్నప్పటికీ.. అవి భారతీయ జీవన (IndiaAI Mission) విధానాన్ని పక్కాగా ప్రతిబింబించలేవు. కానీ ‘వర్య’ను ప్యూర్ ఇండియన్ కాంటెక్స్ట్లో తీర్చిదిద్దారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, పండుగలు, సంస్కృతులు, వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లు, సాంప్రదాయ దుస్తులు, ప్రదేశాలు, ఇక్కడి ప్రజల దైనందిన జీవితాన్ని నిశితంగా అర్థం చేసుకునేలా దీనికి శిక్షణ ఇచ్చారు.
డిజిటల్ సృష్టికర్తలకు వరం
ఈ సాంకేతికత విద్యా రంగం నుంచి ఈ-కామర్స్ వరకు దేశంలోని సామాన్య (IndiaAI Mission) ప్రజలందరికీ అందుబాటు ధరలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఒక పల్లెటూరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థుల కోసం డిజిటల్ పాఠాలను (యానిమేటెడ్ క్లాసులు) రూపొందించాలన్నా.. లేదా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారులు తమ ఉత్పత్తుల ప్రచారానికి తక్కువ బడ్జెట్లో యాడ్స్ సృష్టించాలన్నా ‘వర్య’ (IndiaAI Mission) అద్భుతంగా సహాయపడుతుంది.
ఏఐ రంగంలో మైలురాయి..
ఈ ఆవిష్కరణపై కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. ‘వర్య’ ఏఐ మోడల్ (IndiaAI Mission) దేశీయ సాంకేతిక ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి అని కొనియాడారు. స్వదేశీ ఏఐ సామర్థ్యాలను పెంపొందించడానికి, దేశీయ డీప్ టెక్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం కార్పొరేట్ దిగ్గజాలకో, కొందరికో పరిమితం కాకుండా.. తక్కువ ధరలో సమాజంలోని ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి రావడమే ప్రస్తుత ప్రాథమిక అవసరమని (IndiaAI Mission) అవతార్ సంస్థ కో-ఫౌండర్, సీఈవో శ్రవంత్ ఆలూరు పేర్కొన్నారు. ఈ స్వదేశీ ఏఐ మోడల్ రాకతో గ్లోబల్ ఏఐ రేసులో భారతదేశం వినియోగదారుడి స్థాయి నుంచి క్రియేటర్ స్థాయికి ఎదిగిందని టెక్ నిపుణులు అంటున్నారు.








