2000 వర్సెస్ 2026.. సామాన్యుడి జీవన వ్యయం ఎంత మారిందంటే?
సాధారణంగా ‘ధరలు మండిపోతున్నాయి’ అనే మాట ప్రతి ఇంటా వినిపించేదే. కానీ, కచ్చితంగా పావు శతాబ్దం క్రితం.. అంటే 2000 సంవత్సరంలో ఉన్న ధరలను, ప్రస్తుత 2026 ధరలతో పక్కపక్కన పెట్టి చూస్తే వచ్చే ఆశ్చర్యం అంతాఇంతా కాదు. అప్పటికి ఇప్పటికి నిత్యావసరాల ధరల్లో (Cost of Living) వచ్చిన మార్పులు సామాన్యుల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ‘2000 వర్సెస్ 2026‘ పేరుతో ఓ ఆసక్తికరమైన గ్రాఫిక్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బ్రాండ్లు, నగరాలు, స్థానిక పన్నుల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ.. గత 26 ఏళ్లలో భారతీయ కుటుంబాల జీవన వ్యయం (Cost of Living) ఎంతలా పెరిగిపోయిందో ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి.
నిత్యావసరాల ధరల్లో మార్పు
దేశంలో 2000 సంవత్సరం నాటికి (Cost of Living) లీటరు పెట్రోల్ ధర సగటున రూ. 26 గా ఉండేది. నేడు అది సెంచరీ దాటి రూ. 102 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో ఒడిదుడుకులు ఒక కారణమైతే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు, రవాణా, పంపిణీ ఖర్చులు పెరగడం పెట్రోల్ మంటకు ప్రధాన కారణాలు. ఇంధన ధరల పెరుగుదల కేవలం ప్రయాణాలకే పరిమితం కాలేదు, సరుకు రవాణా భారాన్ని పెంచి పరోక్షంగా అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తోంది.
మరోవైపు, ఒకప్పుడు సామాన్యుడికి సులువుగా (Cost of Living) అందుబాటులో ఉన్న ఎల్పీజీ (LPG) వంటగ్యాస్ సిలిండర్.. ఇప్పుడు వంటింటి బడ్జెట్లో అతిపెద్ద భారంగా మారింది. 2000లో రూ. 157 పలికిన 14.2 కిలోల సిలిండర్ ధర, ఇప్పుడు ఏకంగా రూ. 912కు చేరింది. ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలకు సైతం గ్యాస్ వినియోగం విస్తరించడంతో దిగువ, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ లెక్కలను ఇది తలకిందులు చేస్తోంది.
ఇవి కూడా చదవండి
పాల ధరల నుంచి చదువుల దాకా..
భారతీయ కుటుంబాల (Cost of Living) రోజువారీ ఆహారంలో అత్యంత కీలకమైన పాలు సైతం సామాన్యుడికి ఆర్థిక భారంగా మారుతున్నాయి. లీటరు పాలు రూ. 14 నుంచి రూ. 72కి ఎగబాకాయి. పశువుల మేత, నిర్వహణ, కార్మికుల వేతనాలు, శీతలీకరణ (Refrigeration), ప్యాకేజింగ్ ఖర్చులు భారీగా పెరగడమే ఇందుకు కారణం. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ మూడే కాదు.. దేశంలో జీవన వ్యయాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు పరోక్షంగా కుటుంబ బడ్జెట్ను పిండేస్తున్నాయి. మహానగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ఇంటి అద్దెలు, వైద్య సేవలు, పిల్లల విద్యా ఖర్చులు, విద్యుత్ బిల్లులు గత రెండు దశాబ్దాల్లో ఊహించని స్థాయికి చేరాయి.
పెరుగుతున్న ఖర్చులు..
గత 26 ఏళ్ల వ్యవధిలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ఉపాధి అవకాశాలు, జీతాలు, ప్రజల వినియోగ సామర్థ్యం పెరిగాయన్నది వాస్తవమే. కానీ, నిత్యావసరాల ధరల (Cost of Living) పెరుగుదలతో పోల్చి చూసినప్పుడు.. సామాన్యుల ఆదాయాలు అదే స్థాయిలో పెరిగాయా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఆదాయానికి, పెరుగుతున్న ఖర్చుకు మధ్య ఉన్న ఈ భారీ అగాధాన్ని పూడ్చుకుంటూ, నెలవారీ బడ్జెట్ను ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకోవడమే నేటి సగటు భారతీయ కుటుంబం ముందున్న అతిపెద్ద సవాలని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
వర్సెస్ 2026.. సామాన్యుడి జీవన వ్యయం ఎంత మారిందంటే?
సాధారణంగా ‘ధరలు మండిపోతున్నాయి’ అనే మాట ప్రతి ఇంటా వినిపించేదే. కానీ, కచ్చితంగా పావు శతాబ్దం క్రితం.. అంటే 2000 సంవత్సరంలో ఉన్న ధరలను, ప్రస్తుత 2026 ధరలతో పక్కపక్కన పెట్టి చూస్తే వచ్చే ఆశ్చర్యం అంతాఇంతా కాదు. అప్పటికి ఇప్పటికి నిత్యావసరాల ధరల్లో (Cost of Living) వచ్చిన మార్పులు సామాన్యుల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ‘2000 వర్సెస్ 2026’ పేరుతో ఓ ఆసక్తికరమైన గ్రాఫిక్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బ్రాండ్లు, నగరాలు, స్థానిక పన్నుల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ.. గత 26 ఏళ్లలో భారతీయ కుటుంబాల జీవన వ్యయం (Cost of Living) ఎంతలా పెరిగిపోయిందో ఈ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి.