Stock Market: లక్ష మార్కు అందుకోనున్న సెన్సెక్స్.. మోర్గాన్ స్టాన్లీ అంచనా!
భారత స్టాక్ మార్కెట్ (Stock Market) చరిత్ర సృష్టించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ ‘మోర్గాన్ స్టాన్లీ’ (Morgan Stanley) భారతీయ ఈక్విటీ మార్కెట్లపై అత్యంత సానుకూల ధోరణిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్ ‘రీ-రేటింగ్’ (Re-rating) దశలో ఉందని, ఈ ఏడాది ఆఖరు నాటికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,00,000 (లక్ష) మైలురాయిని చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేసింది.
కోవిడ్ సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకుంటున్న వృద్ధి అనుకూల చర్యలే ఇందుకు ప్రధాన కారణం అని నిపుణులు అంటున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు, వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచడం, మౌలిక సదుపాయాలకు భారీ కేటాయింపులు, పన్ను సంస్కరణలు వంటివి కార్పొరేట్ కంపెనీల లాభాలను పెంచుతున్నాయని విశ్లేషించింది. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతీయ షేర్లు (Stock Market) ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యుయేషన్లలో ఉన్నాయని, చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం కూడా కలిసొచ్చే అంశమని తెలిపింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భారత స్టాక్ మార్కెట్‌ను (Stock Market) మోర్గాన్ స్టాన్లీ భవిష్యత్ అంచనాలను మూడు రకాలుగా విడదీసింది. ప్రస్తుత సానుకూల పరిస్థితులు కొనసాగితే డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 95,000 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఒకవేళ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గి, ఆర్థిక వృద్ధి అంచనాల కంటే ఎక్కువగా ఉంటే.. సెన్సెక్స్ (Sensex) లక్ష మార్కును దాటి, గరిష్టంగా 1,07,000 స్థాయిని తాకే అవకాశం ఉంది. ఒకవేళ చమురు ధరలు భగ్గుమని, వడ్డీ రేట్లు మళ్లీ పెరిగితే మాత్రం సెన్సెక్స్ 76,000 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లను హెచ్చరించింది.













