సరైన సమయంలో తల తిప్పకపోతే… చనిపోయి ఉండేవాడిని
సరైన సమయంలో, కాకతాళీయంగా తల తిప్పాను. లేకపోతే చనిపోయి ఉండేవాడిని. దేవుడి దయ, అదృష్టం వల్ల బతికి ఉన్నాను అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనపై హత్యాయత్నం తర్వాత తొలిసారి స్పందించారు. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించనుండడంతో మిల్వాకీ బయలుదేరిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన కుడి చెవికి బ్యాండేజీ కట్టు ఉన్నట్లు తెలిసింది. కాగా ట్రంప్ ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడడం పూరి జగన్నాథుడి కృపేనని ఇస్కాన్ సంస్థ ప్రతినిధి రాధారమణ్‌దాస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన దుందగుడు థామస్ మాథ్యూ క్రూక్స్ (20) ఫొటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది.






