నేను గెలిస్తే.. ఆయనే ప్రభుత్వ సలహాదారుడు
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వివేక్ రామస్వామి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అయోవాలోని ఒక టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన అనంతరం మీ సలహాదారుడి ఎవరిని నియమిస్తారు అని అడిగిన ప్రశ్నకు వివేక్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ పరిపాలనలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను సలహాదారుడిగా నియమిస్తానని అన్నారు. అందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. అమెరికాకు నేనే ఏమీ చేయాలనుకుంటున్నాను అనే దానికి ట్విటర్ మంచి ఉదాహరణ. గతేడాది ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. అందువల్ల నేను గెలిస్తే ఆయననే ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తా. ట్విటర్ మాదిరిగానే ప్రభుత్వాన్ని కూడా ఆయన సమర్థవంతంగా నడిపించగలరు అంటూ వ్యాఖ్యానించారు.






