ఉక్రెయిన్ కు అమెరికా సాయం.. 42.5 కోట్ల డాలర్లతో
ఉక్రెయిన్‌కు కొత్తగా 42.5 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ సహాయం చేయాలని అమెరికా నిశ్చయించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై అధికార ప్రకటన వెలువడుతుందన్నారు. ఆ ప్రకారం కొత్త ఆయుధాలతో పాటు, పాత ఆయుధాలకు మార్పులు చేర్పులవంటివి ఉండనున్నాయి. ఇంకా రష్యా డ్రోన్లను ధ్వంసం చేయగల లేజర్ ఆయుధాలు, హైమార్స్ రాకెట్లు, నాసామ్స్ క్షిపణులు, ఫిరంగి గుళ్లు, శీతాకాలంలో పోరాటానికి దుస్తులు వగైరా ఉక్రెయ్కు అందనున్నాయి. అమెరికా గతవారమే 15 కోట్ల డాలర్ల ఆయుధ సహాయం చేసింది. తాజా నిర్ణయంతో ఉక్రెయిన్‌కు మొత్తం 50 విడతలుగా ఆయుధాలు పంపుతున్నట్లయింది.






