విదేశీయులపై అమెరికా కొత్త నిబంధనలు!
అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విదేశాల నుంచి వచ్చే వారిపై కొత్త నిబంధనలు అమలు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. వారిని ఎవరెవరు కలిశారో అన్నది తెలుసుకోవడంపై మార్గదర్శకాలు ఇవ్వనుంది. టీకాలపై సృష్టమైన సూచనలు జారీ చేయనుంది. ఇప్పటికే చైనా, భారత్, బ్రిటన్, బ్రెజిల్తో పాటు ఐరోపాలోని పలు దేశాలకు వెళ్లిన అమెరికాయేతరులపై ఆంక్షలు ఉన్నాయి. ఆ దేశాల నుంచి తిరిగి వచ్చి 14 రోజులు దాటిన తరువాతే అమెరికాలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఈ ఆంక్షల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని పలు విమానయాన సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి కూడా.






