అమెరికా నుంచి ఉక్రెయిన్ కు.. తొలిసారిగా
రష్యా పై ఎదురుదాడి చేయడానికి మరిన్ని అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు అమెరికా సిద్దమైంది ఈ మేరకు 400 మిలియన్ డాలర్ల ప్యాకేజీని వాషింగ్టన్ ప్రకటించింది. దీనిలో తొలిసారి బ్లాక్ హార్నెట్ నిఘా డ్రోన్లను కూడా ఉక్రెయిన్‌కు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రోన్లను టెలిడిన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ తయారు చేస్తోంది. నార్వేలో తయారు చేసిన హార్నెట్ డ్రోన్లను ఇప్పటికే ఉక్రెయిన్ వాడుతోంది. వీటిని గతంలో బ్రిటన్, నార్వే విరాళంగా అందించాయి. తాజాగా అమెరికా వాటిని భారీగా సమకూరుస్తోంది. ఇందుకోసం ఏప్రిల్‌లోనే నార్వేకు చెందిన ఎఫ్ఎల్ఐఆర్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్‌కు 93 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టును అమెరికా ఆర్మీ అప్పగించింది.






