జాతి ఆధారంగా అడ్మిషన్లు చెల్లవు.. భారతీయ విద్యార్థులకు ఊరట
అమెరికాలోని కళాశాలల్లో జాతి ఆధారంగా ప్రవేశాలు కల్పించడాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అటువంటి విధానం అమెరికా రాజ్యాంగానికి విరుద్దమని స్పష్టం చేసింది. దీంతో మైనారిటీలుగా ఉండే భారతీయ, ఆసియా విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. విద్యార్థుల ప్రతిభను వ్యక్తిగతంగా చూడాలి. అంతేగానీ జాతి ఆధారంగా కాదు. చాలా విశ్వవిద్యాలయాలు, ఎప్పటి నుంచో ఈ వివక్షను చూపుతున్నాయి. నైపుణ్యాలను అభ్యసించడం, పాఠాలను నేర్చుకోవడం అనేవి జాతిని బట్టి ఉండవు. అది వ్యక్తిగతంగా సంపాదించే గుర్తింపు. శరీర రంగు దానిని ఇవ్వలేదు. రాజ్యాంగ చరిత్ర ఇటువంటి వాటిని క్షమించదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసిది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు తీర్పును సమర్థించగా ముగ్గురు వ్యతిరేకించారు.






