మోదీకి అమెరికన్ గాయకురాలి ప్రశంస
ఆఫ్రికన్ యూనియన్‌కు (ఏయూ) జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ప్రతిపాదించిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రఖ్యాత అమెరికన్ గాయకురాలు, నటి మేరీ మిల్బెన్ ప్రశంసించారు. ఈ పరిణామాలపై మేరీ మిల్బెన్ మాట్లాడుతూ మోదీ ప్రతిపాదన ఎంతో గొప్పది. అది సాహకారమైతే ప్రపంచ ప్రగతి ప్రణాళికల్లో ఇకపై దక్షిణార్థ గోళం పాలుపంచుకుంటుంది. ఆఫ్రికాకు దక్కే ఈ సౌలభ్యంతో అణగారిన వర్గాలకు గొంతుకగా నిలవొచ్చు. భారత్, అమెరికాల మధ్య స్నేహం ఇందుకు దోహదపడాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో అందరికీ అందుబాటులో ఉండే పునరుత్పాదక ఇంధనాలు, పరిశ్రుభమైన నీరు, పోషకాహారం, తక్కువ ఖర్చుతో దొరికే నాణ్యమైన వైద్యం ఆఫ్రికా ప్రజలకూ అందాల్సి ఉంది. జీ20 దేశాలు, ఆఫ్రికన్ యూనియన్ కలిస్తే కొత్త చరిత్రను లిఖించవచ్చు అని పేర్కొన్నారు.






