అమెరికా అధ్యక్ష ఎన్నికలు… డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ ఖరారైంది. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని ఆమె అధికారికంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్లు ప్రకటన చేశారు. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కమలాహారిస్ వివిధ పక్షాల మద్దతు కూడగట్టి పోటీలో నిలబడ్డారు.






