జీ-20 సదస్సు కోసం ఢిల్లీకి రానున్న జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబరు 7 నుంచి 10 వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారని శ్వేతసౌధం ప్రతినిధి తెలిపారు. శుద్ధ ఇంధనానికి మారడం, వాతావరణ మార్పులతో పోరాటం, ఉక్రెయిన్ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక పరిణామాలు సహా ప్రపంచానికి సంబంధించిన అనేక అంశాలను జి`20 భాగస్వాములతో బైడెన్ చర్చిస్తారని తెలిపారు. కూటమికి భారత ప్రధాని అందిస్తున్న సారథ్యం, కూటమి దేశాలకు ఆర్థిక సహకారానికి అమెరికా కట్టుబడి ఉన్నతీరు గురించి అధ్యక్షుడు ప్రస్తావిస్తారని వివరించారు. సభ్య దేశాల నేతల భేటీ 9, 10 తేదీల్లో జరగనుంది.






