జో బైడెన్ నిర్ణయంపై … స్వపక్షం, విపక్షంలో తీవ్ర వ్యతిరేకత
కొన్ని రకాల ఆయుధాలను ఇజ్రాజెల్కు పంపించకుండా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకొన్న నిర్ణయంపై విపక్షం నుంచే కాకుండా స్వపక్షంలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. హమాస్ మద్దతుదారుగా మారారనే ఆరోపణలను సైతం ఆయన ఎదుర్కొంటున్నారు. అమెరికా` ఇజ్రాయెల్ సంబంధాలను ఈ నిర్ణయం తీవ్రంగా దెబ్బతీస్తందని డెమొక్రాట్, రిపబ్లికన్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్‌కు గత వారం 2000 పౌండ్ల బరువైన 1800, 500 పౌండ్ల బరువైన 1700 బాంబుల సరఫరాను అమెరికా నిలిపివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ దీనిని ధ్రువీకరించారు. గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు. దీనిని రిపబ్లికన్లు, డెమోక్రాట్లు తీవ్రంగా వ్యవరేకిస్తున్నారు. రిపబ్లికన్ సెనెటర్ లిండ్సె గ్రాహం స్పందిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాల్లో బైడెన్ నిర్యం అత్యంత దారుణమైందన్నారు. ఆయుధ సరఫరాను కొనసాగిస్తూ ఇజ్రాయెలకు అండగా ఉండాలి అని పేర్కొన్నారు.






