ఆ ఆంక్షలు సడలించండి
కరోనా నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం వీసాల జారీ ప్రక్రియను నిలిపివేయడాన్ని కొట్టివేస్తున్నట్లు అమెరికా కోర్టు ఒకటి ప్రకటించింది. ప్రయాణాలపై ఆంక్షలు, వీసాల జారీ ప్రక్రియ వేర్వేరు అంశాలని ఫెడరల్ జడ్జి జేమ్స్ బోస్బర్గ్ పేర్కొన్నారు. నిబంధనల్లో పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కరోనా వ్యాపిస్తుందనే కారణంతో వీసా ప్రక్రియను ఆపివేయడం చట్ట వ్యతిరేకమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో భారత్ సహా చైనా, యూకే, ఇరాన్, బ్రెజిల్ తదితర అనేక దేశాల నుంచి వచ్చేవారిపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.






