బ్రిటన్ ప్రధానికి జో బైడెన్ ఫోన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఒనగూడే ప్రయోజనాలపై చర్చించారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత జో బైడెన్ ఫోన్లో మాట్లాడిన తొలి యూరోపియన్ నేత బోరిస్ జాన్సన్ కావడం విశేషం. జో బైడెన్‌తో ఫోన్లో మాట్లాడిన తర్వాత బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మట్లాడటం గొప్పగా ఉంది. మా రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ముందడుగు వేయడానికి వేచి చూస్తున్నా..కరోనా నుంచి రెండు దేశాలు రికవరీ సాధించాలని ఆకాంక్షిస్తూ అని ట్వీట్ చేశారు.






