కమలా ..ఎప్పుడైనా దేశ సేవ చేశావా : తులసీ
రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వ్యాన్స్‌కు మద్దతుగా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసీ గబ్బర్డ్ నిలిచారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవల కమల ఓ సభలో మాట్లాడుతూ జేడీ వాన్స్ స్వార్థపరుడని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయంగా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడ లేదని పేర్కొన్నారు. ట్రంప్‌నకు మాత్రమే ఆయన విశ్వాసంగా ఉంటారని అమెరికా ప్రజలను హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తులసీ స్పందిస్తూ.. జేడీ వాన్స్ మెరైన్ కోర్లో పనిచేసి 2005 ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. మరి కమలాహారిస్ గతంలో ఏనాడైనా దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారా? అని ప్రశ్నించారు.






