Tulsi Gabbard : అమెరికా ఫస్ట్ ని అపార్థం చేసుకోవద్దు

అమెరికా ఫస్ట్ (అమెరికాయే ముందు) అంటున్న తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధానాన్ని అపార్థం చేసుకోవద్దని అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) కోరారు. ఇండియా ఫస్ట్ అంటూ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi), న్యూజిలాండ్ ఫస్ట్ అంటూ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ (Christopher Luxon) ఎలా పనిచేస్తున్నారో ఇది కూడా అంతేనని సరిపోల్చారు. అమెరికా మాత్రమే ఎదగాలనేది తమ ఉద్వేం కాదన్నారు. ఢల్లీి వేదికగా జరిగిన 10వ రైసీనా డైలాగ్ లో ఆమె ప్రసంగించారు. ట్రంప్ విధానాలను కొందరు తప్పుగా ఊహించుకుంటున్నారు. ఇతర దేశాలతో సంబంధాలకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోకుండా ఘర్షణలు పెంచుకోవాలని ఆయన చూస్తున్నట్లు అభిప్రాయపడుతున్నా రు. ఆయన అలాంటి వ్యక్తికాదు. ఆయనను ఒంటరి వాది అనుకోవద్దు. ఆయన ఎల్లపుడూ శాంతిని కాంక్షిస్తూ ఐక్యత సాధించాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి. ఆయనలా మోదీ కూడా శాంతి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం ఉత్తమ సేవలు అందించాలని నేతలిద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు అని గబ్బార్డ్ వివరించారు.