Donald Trump: ట్రంప్ వలస నియంత్రణ చర్యలు: అమెరికాకు మంచా, చెడా?

అమెరికా 47వ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించేందుకు నేతలు తీసుకునే చర్యలు సాధారణంగా చెల్లిపోతాయి. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచితూచి అడుగులు వేయడం చాలా ముఖ్యం. అయితే, ట్రంప్ తీసుకున్న కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు ఆ దేశానికి ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చని నిపుణుల అభిప్రాయం.
అక్రమ వలసలను (illegal immigration) ఆపడం అనేది ఒక పద్ధతిలో జరుగితే అందరికీ అభ్యంతరం ఉండదు. కానీ, వలసలపై సమగ్రంగా ప్రభావం చూపించే విధంగా బై బర్త్ గ్రీన్ కార్డు (బయ్ birth green card) సదుపాయాన్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలు వివిధ దేశాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా భారత్ , చైనా, మెక్సికో (Mexico) వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వలసదారుల సంఖ్య గణనీయంగా ఎక్కువ. మెక్సికో నుంచి అక్రమ వలసలు ఎక్కువగా జరగడం వాస్తవం. దీన్ని అడ్డుకోవడం కోసం గతంలో ట్రంప్ గోడ కట్టించిన విషయం తెలిసిందే.
ఇప్పుడైతే మరింత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇలా వలసలను నియంత్రించే నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర రంగాలతో పోల్చితే ఇమ్మిగ్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం అమెరికాకు చాలా కీలకం. ఆర్థిక నిపుణుడు రిచర్డ్ ప్రకారం, వీసాలు, ఇమ్మిగ్రేషన్ శాఖల ద్వారా ఏటా 28 శాతం ఆదాయం వస్తోంది. ఇది కీలకమైన ఐటీ, పారిశ్రామిక రంగాలతో పోలిస్తే 2 శాతం ఎక్కువ. ఇమ్మిగ్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు చాలా సహాయకంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు.
అక్రమ వలసలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్న వాదన ఉన్నప్పటికీ, ఇలాంటి చర్యల వల్ల ఆర్థిక నష్టం తప్పదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వలసలను పూర్తిగా ఆపడం వల్ల నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది పరిశ్రమలకు ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారత ఆర్థిక నిపుణులు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో కరోనా సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు దేశానికి తీవ్రమైన ఇబ్బందులు తెచ్చాయని గుర్తుచేస్తూ, ఇమ్మిగ్రేషన్ విషయంలో అతను మొండిగా వ్యవహరిస్తే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. సరైన పరిష్కారాలను తీసుకోకుండా, కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ట్రంప్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలపై వివిధ దేశాల ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలు అమెరికాకు తక్షణ ప్రయోజనం కలిగించినా, దీర్ఘకాలంలో తీవ్రమైన నష్టానికి దారితీసే అవకాశముంది.